'ఊరు పల్లెటూరు' పాటకు బెస్ట్ సాంగ్ అవార్డు (VIDEO)

తెలంగాణ యాసను, జీవన విధానాన్ని ప్రతిబింబించేలా నిర్మించిన చిత్రం బలగం. ఈ సినిమాకు ఎన్నో అవార్డులు, ప్రశంసలు లభించాయి. తాజాగా బలగం సినిమాలోని ఊరు పల్లెటూరు పాటకు నేషనల్ బెస్ట్ సాంగ్ అవార్డు దక్కింది. కాసర్ల శ్యామ్ ఈ పాటకు లిరిక్స్ అందించారు. సింగర్ మంగ్లీ, రామ్ మిరియాల కలిసి పాడారు. ఈ చిత్రానికి వేణు టిల్లు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ప్రియ‌ద‌ర్శి హీరోగా న‌టించారు. సినిమాలో ప్రియ‌ద‌ర్శికి జోడీగా కావ్య హీరోయిన్‌గా న‌టించింది.

సంబంధిత పోస్ట్