కేదార్‌నాథ్ యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు

బాబా కేదార్‌నాథ్‌ను దర్శించుకోవడానికి వచ్చే యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, వారి ప్రయాణం సులభంగా, సురక్షితంగా ఉండేలా పాత కేదార్‌నాథ్ మార్గంలో తాగునీరు, వర్షం నుంచి రక్షణ కల్పించే షెడ్లు, రైలింగ్‌లు వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సీజన్​ నుంచి భక్తులకు గౌరీకుండ్-రాంబారా-గరుడచట్టి-కేదార్‌నాథ్ పునర్నిర్మించిన మార్గంతో పాటు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న గౌరీకుండ్-రాంబారా-లించౌలి మార్గం కూడా అందుబాటులో ఉంటుంది. రాంబారా నుంచి కేదార్‌నాథ్ దూరం గతంలో 7 కిలోమీటర్లు ఉండగా, ఇప్పుడు 8.6 కిలోమీటర్లకు పెరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్