బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు విష్ణుప్రియ, రీతూ చౌదరి

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. టేస్టీ తేజ, కిరణ్‌గౌడ్ విచారణ పూర్తవగా, విష్ణుప్రియ, రీతూచౌదరిని శుక్రవారం విచారిస్తున్నారు. హర్షసాయి, ఇమ్రాన్, భయ్యా సన్నీయాదవ్ దుబాయ్ వెళ్లిపోయినట్లు సమాచారం. ఇదే తరహా ప్రమోషన్స్ చేసిన సినీ ప్రముఖుల విషయంలో పోలీసులు న్యాయ సలహా తీసుకోనున్నారు. ఏయే మార్గాల్లో వీరంతా డబ్బు పొందారనే విషయంపై ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్