బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ పలువురు సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్‌ఫ్లూయెన్సర్స్‌పై కేసు నమోదు చేసింది. 29 మంది ప్రముఖులతో పాటు పలు కంపెనీలపై కేసు ఫైల్ చేసింది. దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీ, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి, పలువురిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు ఆధారంగా విచారణ చేయనుంది.