కరోనా మహమ్మారికి దేశీయ టీకాను ఆవిష్కరించిన భారత్ బయోటెక్ ప్రస్థానంలో సుచిత్ర ఎల్ల పాత్ర ఎనలేనిది. కొవిడ్ రక్కసి కోరలు చాచి జనాన్ని అల్లాడించిన వేళ కొవాగ్జిన్‌తో మేమున్నామంటూ సుచిత్ర ఎల్ల ముందుకొచ్చారు. భారత ప్రభుత్వం సుచిత్ర ఎల్ల చేసిన కృషిని గుర్తించి 2022లో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది.