TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ రానున్నారని సమాచారం అందుతోంది. ఈ నెల 13 లేదా 14వ తేదీన ఆయన వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్లో ఈ నెల 12 నుంచి 14 వరకు జరిగే భారత్ సమ్మిట్లో పాల్గొనేందుకు HYD రానున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు రాహుల్ పర్యటనకు పార్టీ నేతలు సిద్దమవుతున్నారు. హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా మూడు రోజులపాటు భారత్ సమ్మిట్ నిర్వహించనున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు.