ఓలా, ఉబర్‌కు పోటీగా 'భారత్‌ ట్యాక్సీ'

ప్రైవేటు ట్యాక్సీ సంస్థలకు పోటీగా కేంద్ర ప్రభుత్వం 'భారత్ ట్యాక్సీ'ని తీసుకొచ్చింది. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ అభివృద్ధి చేసిన ఈ సహకార ట్యాక్సీ సేవలు నవంబర్ నుంచి ఢిల్లీలో పైలట్ ప్రాతిపదికన ప్రారంభం కానున్నాయి. సొంత వాహనాలు కలిగిన 650 మంది డ్రైవర్లు తొలుత సేవలు అందిస్తారు. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా విస్తరిస్తారు. ఈ ట్యాక్సీ సేవల్లో డ్రైవర్లకు ఎలాంటి కమీషన్ ఉండదు, కేవలం స్వల్ప సభ్యత్వ రుసుము చెల్లిస్తే సరిపోతుంది.

సంబంధిత పోస్ట్