TG: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బీజేపీ నూతన అధ్యక్షుడు రాంచందర్‌రావుకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. భట్టి విలువలతో రాజకీయం చేస్తారనుకున్నాం. కానీ రోహిత్ వేముల మరణాన్ని రాంచందర్ రావుకు ఎందుకు లింక్ పెడుతున్నారంటూ ప్రశ్నించారు. ఆ కేసును కోర్టు తీర్పు ప్రకారం మూసివేసిందే కాంగ్రెస్ ప్రభుత్వమని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు ఎందుకు ప్రస్తావించారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.