ఉప్పల్ స్టేడియాన్ని సందర్శించిన భట్టి, శ్రీధర్ బాబు (వీడియో)

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. ఈనెల 13న ప్రపంచ దిగ్గజం మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనున్నారు. అభిమానులు ముందుగానే చేరుకోవాలని భట్టి సూచించారు. మెస్సీకి రాష్ట్ర ప్రభుత్వం భారీ భద్రతను కల్పిస్తుందని, హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్