ఇంద్రకీలాద్రిలో భవాని మండల దీక్షలు ప్రారంభం

విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం నుంచి భవాని మండల దీక్షలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. నవంబర్ 1 నుంచి 5 వరకు మాలధారణలు, 5వ తేదీతో దీక్ష ధారణాలు సమాప్తి అవుతాయని, నవంబర్ 21 నుంచి 25 వరకు అర్థమండల దీక్ష ప్రారంభమవుతుందని వివరించారు. డిసెంబర్ 4న కలశ జ్యోతి ఉత్సవం, డిసెంబర్ 15న భవాని దీక్ష విరమణలు పూర్తవుతాయని పేర్కొన్నారు. దీక్ష విరమణల సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆలయ ఈవో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్