BIG ALERT: కాసేపట్లో అర్నబ్ తుఫాన్

తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం సోమవారం ఉదయం తుఫాన్‌ (అర్నబ్‌)గా మారనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (SDMA) వెల్లడించింది. దీని ప్రభావంతో నేడు రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోనూ తేలికపాటి వానలు పడొచ్చని పేర్కొంది. తుఫాన్‌ మంగళవారం తీవ్ర తుఫాన్‌గా, బుధవారం అతి తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్

✕
✕