BIG ALERT: బంగారం కొనుగోలులో కొత్త మోసం

బంగారం కొనుగోలు చేసేవారికి కొత్త మోసం రూపంలో ముప్పు పొంచి ఉందని ప్రచారం జరుగుతోంది. సాధారణంగా బంగారంలో ఇతర లోహాలు కలిపితే క్యారెట్ టెస్టింగ్ ద్వారా నాణ్యతను గుర్తించవచ్చు. అయితే తాజాగా రేనియం పొడిని కరిగించిన బంగారంలో కలిపి మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఈ పొడిని బంగారంలో కలిపితే సాధారణ క్యారెట్ టెస్టింగ్ యంత్రాలు కూడా గుర్తించలేవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో 22 క్యారెట్ల పేరుతో తక్కువ నాణ్యత కలిగిన ఆభరణాలు విక్రయించే ప్రమాదం ఉందని చెబుతున్నారు. బంగారం కొనుగోలు సమయంలో హాల్‌మార్క్, HUID వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕