AP: వైసీపీ సంచలన ట్వీట్ చేసింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేయగా, మంగళవారం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్లి వంశీని పరామర్శించారు. ఈ క్రమంలో 'రాత్రి 7 గంటలకు ‘బిగ్ బ్లాస్ట్’.. గన్నవరం కేసుకు సంబంధించిన నిజాలను బయటపెట్టబోతున్నాం' అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. దీంతో ఆ ‘బిగ్ బ్లాస్ట్’ ఏమై ఉంటుందా అని రాజకీయాల్లో ముమ్మరంగా చర్చ జరుగుతోంది.