BIG BREAKING: తెలంగాణలో తేలిన కులగణన లెక్క

తెలంగాణలో కులగణన లెక్క తేలింది. రాష్ట్రంలో మొత్తం జనాభా 3 కోట్ల 70 లక్షల మంది ఉన్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సర్వేలో 3 కోట్ల 54 లక్షల మంది పాల్గొన్నారు. బీసీ జనాభా- 46.25శాతం, ఎస్సీ జనాభా - 17.43 శాతం, ఎస్టీ జనాభా - 10.45 శాతం, ఓసీ జనాభా -15.79 శాతం, ముస్లిం జనాభా -12.56 శాతం ఉన్నట్లు వెల్లడించారు. ఈ నెల 4న కేబినెట్ ముందుకు కులగణన నివేదిక చేరనుంది. అదే రోజు అసెంబ్లీలో కులగణన నివేదికపై చర్చించనున్నారు.

సంబంధిత పోస్ట్