సీఎం చంద్రబాబుకు తప్పిన పెనుప్రమాదం

AP: విజ‌య‌వాడ‌లోని మధురానగర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. వరదను పరిశీలించేందుకు రైలు వంతెనపైకి కాలినడకన వెళ్లారు. అదే సమయంలో ఎదురుగా రైలు వచ్చింది. చంద్రబాబుకు అతీ సమీపంగా వచ్చింది. రైలు తగలకుండా ఓ పక్కకు నిలబడి ఉండటంతో ప్రమాదం తప్పింది. సీఎం చంద్ర‌బాబుకు మూడు అడుగుల దూరంలో రైలు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్