సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో బిగ్ రిలీఫ్‌

ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డికి హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. రేవంత్‌రెడ్డిపై కాసం వెంక‌టేశ్వ‌ర్లు వేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. రిజ‌ర్వేష‌న్‌ల‌పై సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌ను వ్య‌తిరేకిస్తూ గ‌తంలో నాంప‌ల్లి కోర్టులో కాసం వెంక‌టేశ్వ‌ర్లు పిటిష‌న్ వేశారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఇవాళ ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం.. సంబంధిత కేసును కొట్టివేస్తూ తీర్పు వెల్ల‌డించింది.

సంబంధిత పోస్ట్