TG: రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్ ఇచ్చింది. 12 వేల మందికి ఇందిరమ్మ ఇల్లు రద్దు చేసినట్లు తెలుస్తోంది. అయితే మూడో విడతలో అర్హులైన అభ్యర్థుల పేర్లు తొలివిడతలోనే రావడంతో వారిని గుర్తించి ఇళ్లు రద్దు చేసినట్లు సమాచారం. ఈ మేరకు వారందరినీ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా గుర్తించారని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అయితే వీరికి ఇప్పుడే ఇళ్లు అవసరం లేదని, అర్హతలను బట్టి తదుపరి జాబితాలో ఇళ్లు ఇవ్వనున్నారని తెలుస్తోంది.