కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. బీఆర్ఎస్‌తో జతకట్టిన సీపీఐ(వీడియో)

TG: మున్సిపల్ ఎన్నికల వేళ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో కాగ్రేస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. క్యాతనపల్లి మున్సిపాలిటీలో సీపీఐ, బీఆర్‌ఎస్‌ కలిసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌, సీపీఐ నాయకుల మధ్య సయోధ్య కుదిరింది. రామకృష్ణాపూర్ BRS పార్టీ కార్యాలయంలో సుమన్‌తో సమావేశమైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, AITUC రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్యలు పొత్తు విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 3న పార్టీల వారీగా సీట్లు ఖరారు చేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్