కాంగ్రెస్ నేతలకు బిగ్ షాక్.. 43 మందికి అధిష్టానం నోటీసులు

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఎన్నికల సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ 43 మంది సీనియర్ నాయకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రచారంలో పార్టీ అధికారిక వైఖరికి భిన్నంగా ప్రకటనలు చేయడం వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతిని, ఎన్నికల ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడిందని కాంగ్రెస్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ పేర్కొంది. వీరిలో పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్