ఐబొమ్మ రవికి బిగ్ షాక్.. కస్టడీ రివిజన్ పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా

సినీ పైరసీ కేసులో ప్రధాన నిందితుడు, ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి నాంపల్లి క్రిమినల్ కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను గురువారం కోర్టు తిరస్కరించింది. ఇదే కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు రవికి ఎనిమిది రోజుల కస్టడీ ఇవ్వాలని రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌తో పాటు రవి బెయిల్ దరఖాస్తును కూడా కోర్టు పరిశీలించింది. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, బెయిల్‌కు రవి అనర్హుడని తీర్పు చెప్పగా, పోలీసుల కస్టడీ రివిజన్ పిటిషన్‌పై నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్