KCRకు బిగ్ షాక్.. కవిత పార్టీలోకి బీఆర్ఎస్ MLC?

TG: సీనియ‌ర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి BRSలో చేర‌డం తెలంగాణ‌ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే జీవన్ రెడ్డి చేరికతో అసంతృప్తిగా ఉన్న ఓ కీలక నేత BRSను వీడనున్నారని ప్రచారం జరగుతోంది. వచ్చే ఎన్నికల్లో BRS టికెట్ ఆశిస్తున్న BRS ఎమ్మెల్సీ ఎల్. ర‌మ‌ణ జగిత్యాలలో తన ప్రాధాన్యత త‌గ్గింద‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన క‌విత‌ను క‌లిశార‌ని TRSలో చేరేందుకు సిద్దం అవుతున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తేలాలంటే కవిత గానీ ర‌మ‌ణ గానీ స్పందించాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్