కేతన్ హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్.. క్యాబ్ డ్రైవర్ వాంగ్మూలంతో షాక్

పూణేలో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన కాబోయే భార్య సియా గోయల్‌పై క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం కొత్త అనుమానాలకు దారితీసింది. బాలి ప్రీ-వెడ్డింగ్ ట్రిప్‌కు వెళ్లేందుకు సియా అయిష్టంగా ఉండగా, ఆమె సోదరుడు బలవంతంగా కారులో ఎక్కించినట్లు డ్రైవర్ తెలిపాడు. ప్రయాణంలో సియా డిక్కీలోని బ్యాగ్ నుంచి ఏదో వస్తువు తీసుకున్నట్లు కూడా వెల్లడించాడు. అనంతరం కేతన్ పాస్‌పోర్ట్ కనిపించకపోవడంతో ట్రిప్ రద్దయింది. ఇదంతా ముందే పన్నిన కుట్రలో భాగమని పోలీసులు అనుమానిస్తున్నారు. క్యాబ్ డ్రైవర్ వాంగ్మూలం ఆధారంగా కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్