బిగ్ బాస్ 10.. సెలబ్రిటీల ఎంట్రీతో కొత్త హంగులు!

బుల్లితెర ప్రేక్షకుల ఆదరణ పొందిన 'బిగ్ బాస్' పదో సీజన్ రానుంది. వచ్చే నెల 25 నుంచి సామాన్యుల కోసం 'అగ్నిపరీక్ష 2' పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ సీజన్ లో మరిన్ని ప్రత్యేకతలు, సెలబ్రిటీల ఎంట్రీ ఉండనున్నాయని సమాచారం. తేజస్విని గౌడ, పల్లవి గౌడ, జబర్దస్త్ వర్ష, పవిత్ర, వర్షిణీ, ఎక్స్ ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, నందన, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కల్యాణ్, ఆట సందీప్ భార్య జ్యోతి, రాయల్ మెక్ రమణ, ప్రభాకర్ లేదా ఆయన కుమారుడు చంద్రహాస్ పేర్లు వినిపిస్తున్నాయి. ఆనందం సినిమా హీరోయిన్ రేఖ వేదవ్యాస్ కూడా బిగ్ బాస్ లోకి వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి, అయితే ఆమె గెస్ట్ గా వెళ్లగలనని, పోటీలో పాల్గొనేంత ధైర్యం లేదని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్