ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్-8 ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. 'ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు' అని నాగ్ ప్రోమోలో చెప్పిన డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. సీజన్-8 ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది స్టార్ మా వెల్లడించలేదు.