మహిళల దుస్తులపై బిగ్ బాస్ మాధురి సంచలన వ్యాఖ్యలు

నటుడు శివాజీ వ్యాఖ్యల నేపథ్యంలో మహిళల దుస్తుల వివాదం కొనసాగుతుండగా, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ దివ్వెల మాధురి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక టాక్ షోలో పాల్గొన్న ఆమె, డ్రెస్సింగ్ విషయంలో అమ్మాయిలకు పరిమితులు ఉండాలన్నారు. దుస్తులను బట్టి సమాజంలో లైంగిక దాడులు జరుగుతాయని తాను నమ్ముతానని తెలిపారు. సౌకర్యంగా లేని దుస్తులు ధరించి ఇబ్బంది పడటం కంటే నిండుగా దుస్తులు ధరించడం మంచిదన్నారు. అప్పుడే అందం, గౌరవం పెరుగుతాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్