బిహార్‌ ఓటరు ముసాయిదా జాబితా విడుదల

బిహార్‌లో ఓటర్ల ముసాయిదా జాబితాను ఈసీ శుక్రవారం విడుదల చేసింది. సెప్టెంబర్ 1 వరకు సవరణల కోసం గడువు ఇచ్చారు. అర్హులైన వ్యక్తుల పేర్లను జాబితాలో చేర్చడానికి, అనర్హులుగా భావించినవారి పేర్లను తొలగించడానికి పౌరులు, రాజకీయ పార్టీలు ఈలోగా ప్రతిపాదనలు చేయొచ్చు. జాబితా అన్ని జిల్లాల్లో పార్టీలకు అందించనున్నారు. కాగా, ప్రత్యేక సమగ్ర సవరణకు ప్రతిపక్షాలు ఎప్పటినుంచో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్