బీహార్ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) రాజకీయ పార్టీలకు కీలక హెచ్చరికలు చేసింది. ఏఐ-జనరేటెడ్ వీడియోలు, డీప్‌ఫేక్ కంటెంట్‌ను ఎన్నికల వాతావరణాన్ని కలుషితం చేయడానికి ఉపయోగించరాదు అని స్పష్టంగా తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (MCC) అమల్లో ఉన్నందున, సోషల్ మీడియా లేదా ప్రకటనల రూపంలో షేర్ అయ్యే ఏఐ లేదా సింథటిక్ కంటెంట్‌ను ప్రత్యేకంగా లేబుల్ చేయాలని సూచించారు.