బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం తుది ఓటర్ల జాబితా విడుదలైంది. పట్నా జిల్లాలో ఓటర్ల సంఖ్య 46,51,694 నుంచి 48,15,294కి పెరిగింది. డ్రాఫ్ట్ జాబితా అనంతరం 1,63,600 మంది కొత్తగా చేరారు. ఓటరు వివరాలు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. తుది జాబితా ఆధారంగా రాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు.