బీఆర్ఎస్ గెలుస్తుందనే భయంతోనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు: కౌశిక్ రెడ్డి

TG: ఖైరతాబాద్‌ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ రెడ్డి వ్యవహారశైలిపై బీఆర్‌ఎస్‌ నేత కౌశిక్‌ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు వచ్చాక.. తాను ఎన్నికలకు పోతానని, సుప్రీంకోర్టుకు వెళ్లనని దానం డైలాగ్ కొట్టాడని అన్నారు. కానీ వాళ్లు చేసుకున్న సర్వేలో ఖైరతాబాద్‌లో బీఆర్ఎస్ గెలుస్తుందని తేలడంతో గజ్జున భయపడిపోయారని విమర్శించారు. ఆ భయంతోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పుడే దానం ఓడిపోయినట్టు లెక్క అని కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕