AP: గణపవరం సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అయ్యప్ప భక్తుడు మృతి చెందాడు. మృతుడు ప్రకాశం జిల్లా కురువాది గ్రామానికి చెందిన పల్లా వేణు(45)గా గుర్తించారు. బైక్పై గుంటూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తలకు గాయం కావడంతో వేణు స్పాట్లోనే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.