బైక్, కారు ఢీ.. యువకుడు మృతి

TG: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెబ్బెన మండలంలో బైక్, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శ్రీకాంత్(32) అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్నేహితులతో కలిసి రంగులు ఆడుకున్నాక, స్నానం కోసం వాగుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పండుగ వేళ ఈ ఘటన జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్