ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బైకర్ (వీడియో)

TG: మెదక్ జిల్లా రామాయంపేటలో బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడు నేరుగా వెళ్లి ఆగి ఉన్న లారీని ఢీ కొట్టాడు. రామాయంపేటకు చెందిన నవనీత్ బైక్‌పై HYD వైపు వెళ్తుండగా పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో తీవ్ర గాయాలైన అతడిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

సంబంధిత పోస్ట్