AP: బైకర్ నిర్లక్ష్యం వల్ల ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద ఘటన కాకినాడలో చోటుచేసుకుంది. చెన్నై-కోల్కతా NH-16పై బైకర్ నిర్లక్ష్యంగా రోడ్డు దాటే ప్రయత్నం చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. విశాఖ వెళ్తున్న కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన బైకర్ మాత్రం ఘటన తర్వాత ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.