ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌.. ఎట్టకేలకు స్పందించిన బిల్‌గేట్స్‌

అమెరికాతో పాటు పలు దేశాల రాజకీయాలను కుదిపేస్తున్న లైంగిక వేధింపుల వ్యవహారం ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌పై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ స్పందించారు. జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తాను గడిపిన సమయం తప్పైపోయిందని, అందుకు అందరికీ క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 2011లో ఎప్‌స్టీన్‌ను కలిశానని, మూడు ఏళ్లపాటు కొన్ని విందు కార్యక్రమాల్లో పాల్గొన్నామని, అయితే అతని దీవికి ఎప్పుడూ వెళ్లలేదని, అనైతిక కార్యకలాపాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. ఎప్‌స్టీన్‌ రాసిన డ్రాఫ్ట్ ఈ-మెయిల్స్‌లోని ఆరోపణలు అసత్యమని, తాను వాటిని ఎప్పుడూ పంపలేదని తోసిపుచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్