స్మృతి ఇరానీ సీరియల్‌లో బిల్‌గేట్స్.. వీడియో

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ నటిస్తున్న పాపులర్ హిందీ సీరియల్ ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2’లో అతిథి పాత్రలో కనిపించారు. వర్చువల్ వీడియో కాల్‌లో తులసీ విరానీ (స్మృతి ఇరానీ)ని చూసి 'నమస్తే తులసీజీ, జై శ్రీ కృష్ణ' అంటూ అభిమానులను ఆకట్టుకున్నారు. గర్భిణీ స్త్రీలు, శిశువుల ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించేందుకు ఆన్‌లైన్ సమావేశంలో చర్చించారు. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమం ఆరోగ్య సమస్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది.

సంబంధిత పోస్ట్