మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అమెరికా ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్రమైన హెచ్చరికలు చేశారు. ప్రపంచ ఆరోగ్య కార్యక్రమాలకు అమెరికా ప్రభుత్వం నిధులలో కోత విధించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన 25 ఏళ్ల ప్రపంచ ఆరోగ్య రంగ అనుభవంతో ఈ వాస్తవాలను వివరిస్తున్నానని స్పష్టం చేశారు.