TG: జూబ్లీహిల్స్ బోరబండలో సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 'ప్రజలు కారును షెడ్డుకి పంపించారు. బిల్లా రంగాలు జూబ్లీహిల్స్‌లో ఆటోల్లో తిరుగుతున్నారు. పేదేళ్ల దైవం పీజేఆర్ మృతి చెందినప్పుడు.. ఆయన కుటుంబానికి ఏకగ్రీవంగా ఇవ్వాలని నిర్ణయం జరిగింది. ఆనాడు టీడీపీ కూడా మద్దతు ఇచ్చింది. కానీ కేసీఆర్ ఎన్నికలో పోటీ అభ్యర్థిని నిలబెట్టారు' అని మండిపడ్డారు.