సబ్సిడీ ధరకే వంటగ్యాస్ రీఫిల్ పొందాలంటే వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేసుకోవడం తప్పనిసరి. ఇప్పటికే 89.9% మంది (27.43 కోట్ల మంది) ఈ ప్రక్రియను పూర్తి చేశారు. సెప్టెంబర్ నెలాఖరులోపు ఆధార్ అనుసంధానం పూర్తి చేయనివారికి రాయితీ వర్తించదు. అక్రమ గ్యాస్ కనెక్షన్లను అడ్డుకట్ట వేయడానికి, రాయితీ దుర్వినియోగాన్ని నివారించడానికి ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. వినియోగదారులు గ్యాస్ డెలివరీ సమయంలో, ఏజెన్సీ యాప్ ద్వారా లేదా ఆయిల్ కంపెనీల యాప్ల ద్వారా ఇ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు.