వంటగ్యాస్ సబ్సిడీకి బయోమెట్రిక్ తప్పనిసరి

దేశీయ వంటగ్యాస్ (ఎల్పీజీ) వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాయితీ ధరపై వంటగ్యాస్ సిలిండర్లను పొందేందుకు 2026 అక్టోబర్ 1 నాటికి బయోమెట్రిక్ ఆధార్ ప్రామాణీకరణ (బీఏఏ) ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. అర్హులైన కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ ప్రయోజనాలు అందేలా చూడటంతో పాటు, గృహ అవసరాల సిలిండర్లు వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు అక్రమంగా మళ్లకుండా నిరోధించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం వెల్లడించింది.

సంబంధిత పోస్ట్

✕
✕