‘కేజీఎఫ్’, ‘కాంతార’ చిత్రాల నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ మరో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ట్రాన్స్‌సెండెంటల్ ఫిల్మ్స్‌తో కలిసి ఇస్కాన్ వ్యవస్థాపకుడు ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద జీవిత కథ ఆధారంగా ‘శరణాగతి – ది లైఫ్ ఆఫ్ ఏ సరెండర్డ్ సోల్’ పేరుతో యానిమేటెడ్ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఏఐ మోషన్ క్యాప్చర్ సాంకేతికతతో రూపొందుతున్న ఈ సినిమా 2027 ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.