అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత దేశవ్యాప్తంగా విమాన భద్రతపై టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో పక్షులు ఢీకొడుతున్న ఘటనలు ఇటీవల తరచూ వెలుగుచూస్తున్నాయి. అయితే హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 2025 మొదటి 5 నెలల్లోనే 49 ఘటనలు నమోదయ్యాయి. ఇందులో పక్షులు, జంతువులు విమానాలకు ఢీకొట్టిన ఘటనలే ఎక్కువ. పైగా, 11 మేడే కాల్స్ కూడా వచ్చినట్టు సమాచారం.