ఆసుపత్రిలో డాక్టర్ లేకుండా ప్రసవం.. తల్లి, బిడ్డ మృతి

AP: ఏలూరు జిల్లాలోని చింతలపూడిలో విషాదం చోటుచేసుకుంది. కోడూరి పరిమళ కిరణ్ అనే మహిళ పురిటి నొప్పులతో ఆదివారం సాయి స్ఫూర్తి ఆసుపత్రిలో అడ్మిట్ చేయగా అర్థరాత్రి ప్రసవం చేయటంతో పురిట్లోనే బిడ్డ చనిపోయింది. వెంటనే తల్లిని విజయవాడలో ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. డాక్టర్ లేకుండానే ప్రసవం చేశారని బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్