యూపీలోని మీరట్‌లో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక వివాహిత ఓయో హోటల్‌లో ప్రియుడితో కలిసి బర్త్‌డే వేడుకలు జరుపుకొంటోంది. విషయం తెలుసుకున్న భర్త ఓయో హోటల్ కి రావడంతో గమనించిన మహిళ గోడ దూకి పారిపోయింది. ఆమెపై అనుమానం రావడంతో భర్త పిల్లలతో కలిసి అకస్మాత్తుగా హోటల్‌కు వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.