‘ధమాకా’ దర్శకుడు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో హవీష్ హీరోగా, నిఖిల కోనేరు నిర్మిస్తున్న చిత్రం ‘నేను రెడీ’. ఈ సినిమా టీజర్ ఆంధ్రా అబ్బాయికి, తెలంగాణ అమ్మాయితో నిశ్చితార్థం, వారి మధ్య సాంస్కృతిక, జీవనశైలి సంఘర్షణ నేపథ్యంలో హాస్యభరిత కథాంశంతో ఆకట్టుకుంది. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ‘నేను రెడీ’ నుంచి బ్రహ్మానందం స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేస్తూ, ‘పెద్ద తెరపై హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ట్రేడ్‌మార్క్ హాస్యాన్ని చూడటానికి సిద్ధంగా ఉండండి’ అని తెలిపారు.