జన్మతః పౌరసత్వం కేసు.. సుప్రీం కోర్టులో ట్రంప్‌

అమెరికాలో పౌరసత్వం కల్పించే అంశానికి సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ న్యాయస్థానానికి హాజరయ్యారు. మౌఖిక వాదనలకు హాజరైన తొలి సిట్టింగ్‌ అధ్యక్షుడిగా ఆయన నిలిచారు. తాత్కాలికంగా లేదా అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన తల్లిదండ్రులు కన్న పిల్లలకు జన్మతః లభించే పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్‌ గతంలో ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను కిందిస్థాయి కోర్టులు నిరోధించడంతో ట్రంప్‌ యంత్రాంగం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్