VIDEO: మరో నదిని శుభ్రం చేసిన బిట్టూ తబాహి

మధ్యప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల బిట్టూ తబాహి మరోసారి నదీ శుభ్రత కార్యక్రమంతో ఆకట్టుకున్నాడు. ఢిల్లీలోని యమునా నదిలో ఆదివారం సుమారు 5 గంటల పాటు శ్రమించి 585 కిలోల చెత్తను తొలగించాడు. స్థానికులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు అతడికి సహకరించారు. గతంలో రాజ్‌గఢ్‌ జిల్లాలోని అజ్నార్‌ నదిని కూడా నెలలపాటు శ్రమించి శుభ్రం చేశాడు. ఆ వీడియో వైరల్‌ కావడంతో ‘ది ఓషన్‌ క్లీనప్‌’ సంస్థ అతడికి ఉద్యోగం కూడా ఆఫర్‌ చేసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్

✕
✕