TG: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి చేసిన రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపిక నేపథ్యంలో రాజాసింగ్ ఆరోపణలు చేస్తూ.. రాజీనామా చేశారు. దీంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజాసింగ్ రిజైన్‌ను ఆమోదించారు. దీంతో రాజాసింగ్ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.