బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు. ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు. మంగళవారం ఆయన గాంధీ భవన్లో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు సీబీఐ దర్యాప్తు కోరిన బీజేపీ నేతలు ఇప్పుడు తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్లలో బీజేపీకి 18వేల ఓట్లు వస్తే, లోక్ సభ ఎన్నికల్లో 72 వేల ఓట్లు ఎలా వచ్చాయని, బీఆర్ఎస్ మద్దతు లేకుండానే ఆ పార్టీకి అన్ని ఓట్లు వస్తాయా అని మహేశ్ కుమార్ ప్రశ్నించారు.