TG: రాహుల్ గాంధీ పర్యటనపై బీజేపీకి అభ్యంతరం ఎందుకని సీఎం రేవంత్ ప్రశ్నించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 'ప్రతిపక్ష నేతను అవమానించడం ప్రజాస్వామ్య విరుద్ధం. రాహుల్ విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి సరికాదు. మోదీ ఏం చేసినా కరెక్ట్.. రాహుల్ చేస్తే తప్పా. రాహుల్ ప్రధాని అవుతారనే బీజేపీకి భయం. రాజకీయ విమర్శలతో దేశానికి ప్రయోజనం లేదు. భారత్ సమ్మిట్ తీర్మానాలు భవిష్యత్ తరాలకు ఉపయోగకరం. భారత్ సమ్మిట్‌ను వ్యతిరేకించడం సరికాదు' అని అన్నారు.