బీజేపీకి సీఎం రేవంత్ గురించి మాట్లాడే హక్కు లేదు: TPCC చీఫ్ (వీడియో)

TG: బీసీల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. బీసీలకు అధ్యక్ష పదవి ఇవ్వని బీజేపీకి సీఎం రేవంత్ గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉండి బీసీ బిల్లును కేసీఆర్ ప్రవేశపెట్టలేదన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయబోతున్నామని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ తీసుకురావడం చారిత్రక నిర్ణయమన్నారు.

సంబంధిత పోస్ట్